Thursday, 5 November 2026

సర్వే బృందం పై తేనె టిగాలు దాడి -ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

 

ఝరాసంగం జనవరి 20( జనం సాక్షి) : ఝరాసంగం మండలం లోని బిడే కన్య గ్రామంలో భూ సర్వే బృందం పై తినే టిగాలు దాడి చేశాయి. శుక్రవారం గ్రామంలో ధరణి భూ సర్వే నిర్వహిస్తున్న సమయంలో
తేనెటీగ లు దాడి చేయగా బిడెకన్య గ్రామ సర్పంచ్, ఆర్ ఐ రామారావు సర్వేయర్ లాల్ సింగ్, గ్రామ సేవకులు విఠల్ మల్లేష్,కృష్ణాపుర్ గ్రామ సేవకులు మల్లన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే తో పాటు ఝరాసంగం తహశీల్దార్ శ్రీనివాస్, మాజీ ఆత్మ చైర్మన్ రామకృష్ణ రెడ్డీ, గోవర్ధన్ రెడ్డీ, సుభాష్ రెడ్డీ కొహిర్ మండల అద్యక్షులు నర్సింలు యాదవ్ తదితరులు ఉన్నారు.