డాక్టర్ ఎస్ ఏ .సంపత్ కుమార్ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే,ఏఐసీసీ సెక్రెటరీ
అలంపూర్ జనంసాక్షి (జనవరి 20) బిఆర్ ఎస్ పార్టీ కిఓట్లు, కాంగ్రెస్ పార్టీ రైతు శ్రేయస్సు కావాలి అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం అలంపూర్ , బుక్కాపురం, ఉట్కూరు లిఫ్టులను అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రెటరీ కార్యకర్తలతో కలసి సందర్శించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ , బుక్కాపూర్, ఉట్కూర్ , లిఫ్టుల పరిధిలో కాల్వ కింద మినుములు, పత్తి, మిరప, మొక్కజొన్న ,పంటలను రైతులు వేయడం జరిగింది. అట్టి పంటలకు సాగునీరు రావడం లేదని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే నీళ్ళు వదిలి, డి ఫార్టీ వరకు ఆర్డీఎస్ నీళ్లు విడుదల చేసి, దాదాపు పద హైదు వేల ఎకరాల పంటలకు నీరు వదిలి పంట సాగును,రైతులను ఆదుకోవాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల ప్రెసిడెంట్ అడ్డాకుల రాము, ఆసిఫ్ ఖాన్, బుక్కాపురం లక్ష్మీదా రెడ్డి, నవీన్ రెడ్డి, కోనేరు గోపాల్, లింగన్వాయ్ తిప్పన యాదవ్, అలంపూర్ ఎల్లన్న, రామకృష్ణ నరసింహ, బుచ్చన్న పాల్గొన్నారు.
బిఆర్ఎస్ కి ఓట్లు కావాలి కాంగ్రెస్ పార్టీకి రైతులు కావాలి




