రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 7. (జనంసాక్షి). దేశ సహజవ్ వనరులనుసంపదను ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్న నరేంద్ర మోడీ విధానాలపై సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని కార్మిక భవన్ లో సిపిఐ జిల్లా నాయకులు పంతం రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు దేశ సమగ్రతకు ప్రమాదకరంగా మారాయని ఆవేద వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలతో పాటు అడ్డు అదుపు లేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ మరో వైపు దేశ వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే కాకుండా వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలోని గడపగడపకు తీసుకెళ్లి బిజెపి హటావో దేశ్ కి బచావో నినాదంతో ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు. ఏప్రిల్ 14 నుండి కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. బిజెపి నియంతృత విధానాలను ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు నాయకులు సామల మల్లేశం,కడారి రాములు, మంద సుదర్శన్, నల్ల చంద్రమౌళి, పలువురు నాయకులు పాల్గొన్నారు.





