హైదరాబాద్: రాష్ట్రంలో వరదల కారణంగా పలు జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి అందుతున్న సహాయక చర్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పైఎస్ విజయమ్మ ఆరా తీశారు. అన్ని జిల్లాల పార్టీ సమన్వయకర్తలతో ఫోన్ లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రజలకు సహాయ చర్యలు అందించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.




