Wednesday, 4 November 2026

సాంకేతిక లోపంతో నిలిచిన పలు రైళ్లు

హైదరాబాద్: వరంగల్‌, ఖమ్మం రైల్వే విద్యుత్‌ లైనులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెక్కొండ-వెలుగూరు రంగం పేట వద్ద బుధవారం ఓహెచ్‌ విద్యుత్‌ వైర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా అధికారులు పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విద్యుత్‌ లైనులో సాంకేతికలోపం కారణంగా మహబూబాద్‌లో శాతవాహన, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, నెక్కొండలో సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలు, కేసముద్రం దగ్గర తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సాంకేతిక లోపం తలెత్తిన విద్యుత్‌ లైనును పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసరమున్న పలువురు ప్రయాణికులు రైలు దిగి రోడ్డు మార్గాన బస్సుల్లో వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *