సాంస్కృతిక సారథి కళాకారుల కళాజాత
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (10): మండలంలోని తాడిపర్తి గ్రామంలో సంస్కృతిక సారథి వనపర్తి జిల్లా కళాబృందం ఆధ్వర్యంలో శనివారం ఓటర్ నమోదు, కంటి వెలుగు, క్షయ వ్యాధి, కుష్టు వ్యాధి నిర్మూలన, బాల్యవివాహాలు, పరిసరాలు పరిశుభ్రత, రోడ్డు ప్రమాదాల వంటి వాటిపై కళాజాత కళాకారులు ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, కళాకారులు శివలింగం, ఎన్ శ్రీనివాసులు, డి కృష్ణయ్య, బోనాసిరాజు ఎన్ సువర్ణ, ఎం రాధ, తదితరులు పాల్గొన్నారు




