Wednesday, 4 November 2026

విద్యార్థుల ఆరోగ్య రక్షణే ద్యేయం :ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రత్

విద్యార్థుల ఆరోగ్య రక్షణే ద్యేయం :ప్రిన్సిపల్ డాక్టర్ ఇశ్రత్ :శామీర్ పేట్, జనం సాక్షి :
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట) శామీర్ పేట లో గత రెండు రోజులుగా విద్యార్థినిలకు చిరుధాన్యాలు యొక్క అవసరము విషయమై డాక్టర్ దేవరాజ్ జాయింట్ ప్రెసిడెంట్ అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం
రోజున ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో
బృందము విచ్చేసి కళాశాల విద్యార్థునిలకు
పలు రకాల రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన 200 విద్యార్థుల యొక్క రక్త నమోనాలు సేకరించారు .
ఈ కార్యక్రమంలో
ప్రిన్సిపాల్ డాక్టర్ ఇస్రాత్ , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శోభారాణి, వైద్యులు డాక్టర్ భాగ్యలక్ష్మి మరియు మరియు ఎన్ఐఎన్ బృందం డాక్టర్ దేవరాజ్, వి అరుణ విద్యార్థినిలు అంకిత, జ్యోతి, స్వాతి, గ్లోరీ తదితరులు పాల్గొన్నారు.
10ఎస్పీటీ -1: వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం