సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ కొండమల్లేపల్లి నవంబర్ 21 జనం సాక్షి న్యూస్ : సాగునీటిని రైతుల పంటలకు పొదుపుగా వాడుకోవాలని మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు కొండమల్లేపల్లి మండల కేంద్ర పరిధిలోని పెళ్లిపాకుల ప్రాజెక్టు యొక్క నీటిని దిగువ భూములకు డిఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యాసంగి పంటలకు సాగునీటి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంటను పండించేటువంటి ప్రతి రైతు కూడా యాసంగి కాలంలో నీటిని వృధా కాకుండా పొదుపుగా వాడుకోవాలని చివరి భూముల వరకు సాగునీరు అందే విధంగా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్, శంకర్ నాయక్, సక్రు నాయక్, ఎల్లయ్య, లక్ష్మయ్య, రాములు, శివ తదితర రైతులు పాల్గొన్నారు
సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్




