Thursday, 5 November 2026

ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బైంసా తహసిల్దార్ కు వినతి పత్రం

నవంబర్ 21 జనం సాక్షి బైంసా . రూరల్

ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బైంసా తహసిల్దార్ కు వినతి పత్రం

ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని,
బీడీ కార్మికులందరికీ జీవన భృతి అమలు చేయాలని, పోడు సాగు చేస్తున్న ప్రజలకు గిరిజన గిరిజనెతర్లకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ
బైంసా తహసిల్దార్ గారికి ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్
దుర్గం నూతన కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మన సురేష్,
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీమోహన్, జిల్లా కమిటీ సభ్యులు జాన్ పాల్ మోడపు, డివిజన్ నాయకులు మేత్రి నారాయణ ,సిఐటియు మండల నాయకులు శ్రావణ్, చంద్రే లక్ష్మణ్, లు పాల్గొన్నారు.