హైదరాబాద్: సికింద్రాబాద్‌లో రెండురోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్‌జంగ్ దారుణహత్య కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేధించారు. పాతబస్తీకి చెందిన నలుగురు నిందితులను ఈరోజు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై సంజయ్ దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. కేసు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.




