Wednesday, 4 November 2026

సామూహిక అక్షరాబ్యాసం.

సామూహిక అక్షరాబ్యాసం.
ఫొటో : అక్షరాబ్యాసం చేయిస్తున్న సర్పంచ్.
నెన్నెల, నవంబర్ 7, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ ఇందూరి శశికల ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాబ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రాజమణి, ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.