ఫొటో : అక్షరాబ్యాస కార్యక్రమంలో పాల్గొన్న జంటలు.బెల్లంపల్లి, జనవరి 26, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గురువారం వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించారు. సరస్వతి మాత సమక్షంలో వేద పండితులు రుద్రభట్ల శివకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోతికంగా 65 మంది చిన్నారులకు అక్షరాబ్యాసం చేయించారు. ఈకార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి విద్యా సాగర్, సమితి కార్యదర్శి మద్దెర్ల శ్రీనివాస్, ప్రధానచార్యులు జుమ్మిడి నాగేష్, పాఠశాల సభ్యులు బాల సంతోష్, రేణుకుంట్ల శ్రీనివాస్, కమల్ కిషోర్ లాహోటి, బేని గోపాల్ కార్వ, నల్మస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




