Wednesday, 4 November 2026

శ్రీ త్రిశక్తి గాయత్రీ దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి న్యూస్ :—భువనగిరి పట్టణంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయం ఎదురుగా ఆండాల్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ త్రిశక్తి గాయత్రీ దేవి, పాదుకా సంతాన నాగేంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ గురు మదనానంద శారదా పీఠాధిశ్వరుడు
శ్రీ శ్రీ శ్రీమాధవానంద సరస్వతి స్వామి, భీమాశ్రమ్ స్వామి హాజరయ్యారు.ధ్యానప్రస్థం వ్యవస్థాపకుడు దివ్యజ్ఞాన గురూజి(గౌరీభట్ల విట్టలశర్మ) ఆధ్వర్యంలో వేద పండితులచే పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ,ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నబోయిన అంజనేయులు, ఎంపీపీ నరాల నిర్మల, గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల వెంకటేశ్వరరావు,అధ్యక్షుడు కె. రాధాకృష్ణమూర్తి , సభ్యులు కానాల శ్యామ్ సుందర్ రావ్, కె.భాస్కరరావు పాల్గొన్నారు.