– టేకులపల్లి ఎంపీడీవో బాలరాజు
టేకులపల్లి ,ఆగస్టు 14( జనం సాక్షి ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగం గా ఆగస్టు 16న ఉదయం 11:30 నిమిషాలకు టేకులపల్లి మండల కేంద్రంలో జిహెచ్ఎస్ టేకులపల్లి లో జరిగే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, గ్రామ యువకులు ,గ్రామ ప్రజలు, ఎస్ జి హెచ్ గ్రూప్ సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ హాజరై జయప్రదం చేయవలసినదిగా టేకులపల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి బాలరాజు కోరారు.




