Tuesday, 3 November 2026

సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ విపక్షాల ఆందోళనలతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి సిద్దమైంది. ఈ సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల నేతలతో బాబ్లీ ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బాబ్లీపై సుప్రీంకోర్టు ఇచ్చన తీర్పుపై పున:సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయాలని ఈ భేటీలో విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *