ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 29 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహ అన్నారు. మండల పరిదిలోని ఎర్రవల్లి చౌరస్తా కూడలిలో సాయిచంద్ చిత్రపటానికిి పూలమాలు వేసికు కన్నీటి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి స్నేహ మాట్లాడారు. సాయిచంద్ పద్నాలు గేళ్ళ వయస్సు నుండే సామాజిక గీతాలు పాడేవారని అని అన్నారు. సాగుయోగ్యమైన భూములుండి, కృష్ణా, తుంగభద్ర లాంటి రెండు జీవనదులుండి పాలమూరులో ఆకలిచావులు ఎందుకున్నాయని తన పాటల ద్వారా పాలకులను ప్రశ్నించాడని అన్నారు.
తెలంగాణ వెనుకబాటుకు కారణం వలసపాలనే అని గుర్తించి స్వరాష్ట్రంకోసం తన స్వరాన్ని అంకిత మిచ్చాన ఉద్యమ నాయకుడు అన్నారు. ముప్పైమూడు జిల్లాల్లో అలుపెరుగని గానం చేశాడన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషిచేశారని అన్నారు. సాయిచంద్ చిన్నతనంలోనే కన్నుమూయడం బాధాకరమని, బౌతకంగా మనకు దూరమైనా తన పాటల రూపంలో తెలంగాణ గడ్డపై సజీవంగా ఉంటాడన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అమరుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కావలిమణ్యం, షేక్ పల్లి సర్పంచ్ రవీంధర్ రెడ్డి, బీచుపల్లి సర్పంచ్ నర్సమ్మ, జెఏసి నాయకులు రాగన్న. భీమేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు జి. శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటిరెడ్డి, డి.రాములు, శంకర్ నాయుడు. వీరబాబు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సాయిచంద్ అకాల మరణం రాష్ట్రనికే తీరని లోటు -ఎంపిపి స్నేహ




