సావిత్రి భాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త :అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :సావిత్రి బాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, మహిళ ల విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయురాలని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. మంగళవారం శామీర్ పేట లోసావిత్రి బాయి 192 వ జయంతి సందర్భంగా అఫ్జల్ ఖాన్ ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. ఆమె తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే తో కలిసి సమాజం లోని అసమానతలను రూపు మాపడానికి ఎనలేని కృషి చేశారని , ఎన్ని అవరోదాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగారని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు వీరి ఆశయాలు అనుసరిస్తూ సామాజిక సేవ లో పాల్గొనాలని అఫ్జల్ ఖాన్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, బత్తుల శశికాంత్ యాదవ్, నిసార్ అహ్మద్ ఖాన్ , మహేష్, సురేష్, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
3ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
సావిత్రి భాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త :అఫ్జల్ ఖాన్




