హైదరాబాద్ సిటీ: తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తెలుగు వర్సిటీ వి విధ ప్రక్రియల్లో ప్రదానం చేసే సా హితీ పురస్కారాలకు సూచనలను ఆహ్వానిస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు గాను ప్రదానం చేసే పురస్కారాలకు వివిధ వర్గాలు, విశ్వవిద్యాలయాలు తగు సూచనలు పంపించాలని వర్సిటీ ప్రకటన జారీ చేసింది. 2010 నుంచి 2012 వరకు వెలుబడిన పుస్తకాలను 2013 పురస్కారాలకు సూచించాలి. 2011 నుంచి 2013 మధ్య వెలుబడిన పుస్తకాలను 2014 పురస్కారాలకు సూచించాలి. వచన కవిత, పద్య కవిత, బాలసాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం, నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం వంటి పది ప్రక్రియల్లో తమకు నచ్చిన వాటిని పురస్కారాలకోసం సూచించాలి. 2014 పురస్కారాల్లో వీటితో పాటు గేయ కవితా పురస్కారాన్ని అదనంగా చేర్చారు.
ఈ పురస్కారం కోసం 2009 నుంచి 2013 మధ్య కాలంలో ప్రచురితమైన గేయకవితా సంపుటాలను సూచించాలి. సూచనల్లో ప్రక్రియ పేరు, గ్రంథఽం పేరు, రచయిత పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ క ర్త పేర్లు పేర్కొనాలి. రచయితలు తమ గ్రంథాలను స్వయంగా సూచించవచ్చు. వచన రచన ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించిన గ్రంథాలను సూచించాలి. సూచనలు పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వవిద్యాలయం రి జిసా్ట్రర్‌కు సెప్టెంబర్ 5లోగా పంపాలి.




