సింగరేణిలో ఘోరప్రమాదం


` గనిపైకప్పుకూలి నలుగురు కార్మికుల మృతి
` మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ 3గనిలో ఘటన
`సంతాపం తెలిపిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, సంస్థ సీఎండీ శ్రీధర్‌
మంచిర్యాల,నవంబరు 10(జనంసాక్షి):మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 గనిలో బుధవారం ఉదయం గనిపైకప్పు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గనిలోని 21 డిప్‌ 24 లెవల్‌, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్‌ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్‌ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్‌(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు.ప్రమాద సమాచారం తెలుసుకున్న గని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టారు. గనిపై కప్పు 14 విూటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందంతో కూలిందని అధికారులు తెలిపారు. కార్మికులు గని పైకప్పు సపోర్టు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గని ప్రమాద స్థలాన్ని బెల్లంపల్లి రీజియన్‌ సేఫ్టీ జీఎం బల్లారి శ్రీనివాస్‌, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ గోసిక మల్లేశం సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గని ప్రమాదం పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ప్రమాదంపై మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవితగ్భ్భ్రాంతి
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు టీబీజీకేఎస్‌ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇక పై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అధికారులను కోరారు.
ప్రమాదంపై యాజమాన్యం సంతాపం
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌ శ్రీధర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారు లేని లోటు కంపెనీ తీర్చలేక పోయినప్పటికీ తోటి సింగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే గని మ్రాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరపున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.