Monday, 2 November 2026

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

– గనికార్మికులకు సీఎం వరాల జల్లు

– వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తాం

– ఈసారి ఎవరెన్ని కేసులు వేసినా తిప్పికొడతాం

– ఇంటి నిర్మాణం కోసం రూ. 6లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం

– కార్మికులను దుర్భర స్థితిలోకి నెట్టిన ఘనత జాతీయ సంఘాలదే

– సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీజీబీకే ఘన విజయం ఖాయం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి):సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందేనన్న కేసీఆర్‌ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. టీబీజీకేఎస్‌ అనేది ఉద్యమ సమయంలో పుట్టిన కార్మిక సంఘమని తెలిపారు. గతంలో ఈ రాష్టాన్న్రి కాంగ్రెస్‌, టీడీపీ పరిపాలించాయని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలు సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంతకాలం సింగరేణిలో ఏం జరిగిందో కార్మికులందరికీ బాగా తెలుసు అన్నారు. జాతీయ సంఘాలన్నీ కలిసి డిపెండెంట్‌ ఉద్యోగాలు పూర్తిగా కోల్పోయేట్లు కలిసి సంతకం పెట్టాయని, వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటామంటూ సంతకాలు పెట్టని అనుబంధ సంఘమే లేదన్నారు. ఆ సంతకాలు పెట్టే సమయానికి టీబీజీకేఎస్‌ పుట్టనేలేదని, సింగరేణి కార్మికుల సమస్యలు అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తే దానిపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని, వారసత్వ ఉద్యోగాలపై కోర్టు స్టే ఇస్తే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి పనులను అడ్డుకోనేందుకు ముఠాలుగా ఏర్పడి కోర్టుల్లో స్టేలు తెచ్చే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నాయన్నారు. ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఠా 17 కేసులు వేసిందని, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు మరో ముఠా ఉంది. ఊ అంటే కోర్టుకు వెళ్లే ముఠా ఉంది కాబట్టి.. మళ్లీ వారసత్వ ఉద్యోగాలపై లీగల్‌ ఓపినీయన్‌ తీసుకున్నామని కేసీఆర్‌ తెలిపారు.. కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని, అది కేసీఆర్‌ ఇస్తున్న మాటఅని, నేను మాటిస్తే చేసి తీరుతానని స్పష్టంచేశారు. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే కార్మికులకు ఆక్సిజన్‌ లభించదని, మోకాలు చిప్పలు అరిగిపోతాయని వారి ఇబ్బందులపై నాకు పూర్తి అవగాహన ఉందన్నారు. సింగరేణిలో పనిచేసి రిటైర్డ్‌ అయిన వారు పది సంవత్సరాలు బతికే పరిస్థితి లేదన్నారు. ఆ సమస్యను అర్థం చేసుకొనే ప్రయత్నం ఎప్పుడూ ఈ జాతీయ సంఘాలు అర్థంచేసుకోలేదని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు వద్దనుకుంటే లంక్సమ్‌ ఎమౌంట్‌ కింద రూ.12.50లక్షల ఇస్తున్నామని దానిని 25లక్షలు చేసి ఇస్తామన్నారు. అది కాకుంటే నెలవారీగా సర్వీస్‌ ఉన్నంతకాలం రూ. 25వేలు ఇస్తామన్నారు. సింగరేణిలో జాతీయ పార్టీల పుణ్యమా అని 14వేల నుంచి 19వేల మంది వరకు డూబిలికేట్‌ ఉద్యోగస్తులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ వీరిని బెదిరించటమేనన్నారు. వారికి సొంతపేరు విూదనే వారికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కార్మికుల పిల్లలకు మాత్రమే ఇబ్బందికరమైన జబ్బులు వచ్చినప్పుడు సింగరేని ద్వారా పెద్ద ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఉండేదని, అలా కాకుండా కార్మికుల తల్లిదండ్రులకు కూడా ఈ

అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. సింగరేని కార్మికులకు ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే రూ. 6లక్షల వరకు ఎలాంటి వడ్డీలేని రుణాలు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సింగరేణిలో లాభాలు వస్తే గతంలో కార్మికులకు 16శాతం వాటా ఇచ్చేదని, దానిని 25శాతానికి పెంపు చేశామన్నారు. దసరా పెస్టివల్‌ కు అడ్వాన్ష్‌ 8వేలు ఇచ్చేదని, ప్రస్తుతం 25వేలకు పెంచింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అని కేసీఆర్‌ తెలిపారు.

ఇన్‌కంట్యాక్స్‌ రద్దుచేయిస్తాం..

సింగరేణి కార్మికులు ఇన్‌కంట్యాక్స్‌, ప్రొఫెసనల్‌ ట్యాక్స్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికుల నుంచి డిమాండ్‌ ఉందని కేసీఆర్‌ తెలిపారు. ప్రతి యేటా 175కోట్లు ప్రొఫెసనల్‌ ట్యాక్స్‌ కట్టేవారని, సింగరేణి కార్మికులు చెల్లించే రూ.175 కోట్లు వృత్తిపన్ను రద్దు చేశామని, అదిచేసింది కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇన్‌కంట్యాక్స్‌ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్న కేసీఆర్‌ దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తారన్నారు. అవసరమైతే దేశంలోని బొగ్గు గని కార్మికులందరినీ ఏకం చేసి ఒత్తిడి తెస్తామన్నారు. గనుల్లో కార్మికులు చనిపోయినప్పుడు గతంలో లక్ష ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారని, ఆ సమయంలో చంద్రబాబుపై పోరాటం చేసి దానిని రూ. 6లక్షలకు పెంచేలా చేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత దానిని 25లక్షలకు పెంచామని కేసీఆర్‌ తెలిపారు. గతంలోని సంఘాలు సింగరేణిలో 3,527 డిపెండింగ్‌ ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టారని, టీఆర్‌ఎస్‌ ప్రబుత్వం హయాంలో ఒకే టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని, నిర్దాక్షణ్యంగా తొలగించిన 500మందికి ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్‌ పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని 11 డివిజన్‌లలో గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయని, వీటన్నింటిలో టీజీబీకే జెండా ఎగరటం ఖాయమని స్పష్టం చేశారు.

జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు..

రాష్ట్రంలో ఎలక్టాన్రిక్‌, ప్రింట్‌ విూడియాల్లో పనిచేస్తున్న అన్ని వర్గాల జర్నలిస్టులకు నెల రోజుల్లోఇండ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టంచేవారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఇప్పటికే నిధులు కేటాయించామని, వాటిని పెంపు చేస్తామన్నారు. రెండు మూడు ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం సర్వే

చేయటం జరిగిందని వీలుంటే ఒకే చోటనే అందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ప్రక్రియను 25రోజుల్లోనే పూర్తి చేసి అందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్‌, ఎంపీలు కవిత, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.