సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27 కు వాయిదా!

సింగరేణి ఎన్నికలు డిసెంబర్ 27 కు వాయిదా!

నామినేషన్ లు వేసిన తదుపరి,గుర్తులు కూడా కేటాయించిన అనంతరం సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సింగరేణి యాజమాన్యం ఎన్నికల వాయిదాకు కోర్టుకు వెళ్లిన దృశ్య, కోర్ట్ ఆదేశం మేరకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
సింగరేణి ఎన్నికలు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తర్వాత నిర్వహించాలని యాజమాన్యం వేసిన పిటిషన్లో వాదనలు విన్న తరువాతఅక్టోబర్ 28 కి బదులుడిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది