Wednesday, 4 November 2026

సింగరేణి ఏరియా హాస్పటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి.

 

 

 

 

 

– టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్.ఫొటో : వినతి పత్రాన్ని అందజేస్తున్న నాయకులు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 11, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సింగరేణి ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఏరియా హాస్పిటల్ నందు చిల్డ్రన్స్, ఆర్తో స్పెషలిస్టును నియమించాలన్నారు. జనరల్ ఫిజీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, గైనకాలజిస్ట్ ల కొరత ఉందని వారిని నియమించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేసి కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ప్రాణంతకమైన వ్యాధుల బారిన పడిన పేషెంట్లను కార్పోరేట్ హాస్పిటలకు రిఫర్ చేసే అధికారం బెల్లంపల్లి అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు అధికారం ఇవ్వాలన్నారు. బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ, అబ్బాపూర్ వర్క్ షాప్ సిహెచ్బి సివిల్ డిపార్ట్మెంట్లలో, శాంతిఖని గనితో పాటు ఓసిపి గనులపై డీజీఎంఎస్ ఆదేశించిన ప్రకారంగా అంబులెన్స్ల తో పాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు, కుటుంబ సభ్యులకు వారు పని చేసిన ఏరియాలో కాకుండా వారు నివాసం ఉంటున్న అందుబాటులో ఉన్న సింగరేణి ఏరియా హాస్పిటల్స్ నందు వైద్య సౌకర్యం సదుపాయం కల్పించాలని కోరారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఏరియా హాస్పిటల్ లో పడకల సంఖ్య పెంచి బ్లడ్ బ్యాంకు ని ఏర్పాటు చేయాలని, కరోనా సమయంలో 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని, కాంట్రాక్టు వైద్య సిబ్బందిని తొలగించి పర్మినెంట్ వైద్య సిబ్బందిని నియమించాలని అన్నారు. పైడిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని లేనిపక్షంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ మరియు బెల్లంపల్లి ఏరియా జిఎం ఆఫీస్ ముందు గనుల పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండి హసన్, బొల్లు మల్లయ్య, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు హరి కిషన్ పాండే, మండల అధ్యక్షుడు గోకర్ణ శేఖర్, సంతోష్, రాజయ్య, మొహమ్మద్ జాఫర్, సిహెచ్ రమేష్ పాల్గొన్నారు.