Wednesday, 4 November 2026

సింగరేణి ని నట్టేట ముంచిన రాష్ట్రం.

బిఎమ్మెస్ ఆధ్వర్యంలో ఆర్కే 6 గని సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా పేరం రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరై కార్మికుల ఉద్దేశించి మాట్లాడడం జరిగినది.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ అయిన సింగరేణిని సింగరేణి కార్మికులను నట్టేట ముంచుతూ ,సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి దారి మళ్లిస్తూ నయవంచన చేస్తున్న ముఖ్యమంత్రి మాటలు నమ్మవద్దని దానికి తోడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఐదు సంవత్సరాలుగా కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ముఖ్యమంత్రి కార్మికులకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో తెలుసుకోవాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగినది.2017 అక్టోబర్ 5 తారీఖు నాడు జరిగిన సింగరేణి ఎన్నికల్లో, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్టు నెరవేర్చలేదు.శ్రీరాంపూర్ ఏరియాలో సమావేశంలో ముఖ్యమంత్రి గారు పదివేల డబల్ బెడ్ రూమ్ క్వార్టర్లు కట్టిస్తానని 400 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని హామీ ఇవ్వడం జరిగింది. అట్టి హామీ నీటిమూటలైంది.2) మారుపేరులను మారుస్తానని వెంటనే సర్కులర్ జారీ చేస్తున్నానని ముఖ్యమంత్రి హామీ ఏమైంది.3) ప్రతి కార్మికునికి రెండు గుంటల స్థలము మరియు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని చెప్పిన నాయకుల మాటలు అమలు కాలేదు4) సింగరేణిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు నాకు ఆ పదమే వినిపించద్దని ఇక నుండి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో ఉండాలని ప్రగడ్బాల్ పలికిన ముఖ్యమంత్రి మాటలు ప్రగతి భవనం దాటలేదు.5) నాలుగు కొత్త బాలు 4500 ఉద్యోగాలు అని చెప్పిన నాయకుల మాటలు ఒక్క తట్టెడు పెల్ల కూడా తీయలేదు ఒక కొత్త ఉద్యోగం కూడా సింగరేణిలో ఇవ్వలేదు అని అన్నారు.
6) సింగరేణిలో ఇన్కమ్ టాక్స్ రద్దు చేపిస్తామని మాయమాటలు చెప్పినారు.7). సింగరేణి కార్మికుని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లను అనుసంధానం చేస్తామని చెప్పి మాట తప్పినారు.8) కారుణ్య నియామకాల్లో ఒక్కరోజు సర్వీసులో ఉన్న అన్ఫిట్ కు రాత కల్పిస్తామని 16 జబ్బులతో కూడిన నివేదికను అందించాలని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, కారుణ్య నియమకాలు కాస్త కాసుల నీ మొఖాలుగా మార్చిన ఘనత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఎద్దేవా పలికినారు.9). రాష్ట్రంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్ది ఉత్సవాల పేరు మీద సింగరేణి సొమ్ముతో ఎమ్మెల్యేలు ఎంపీలను ఉసిగొల్పి సింగరేణి సంస్థ సొమ్మును అప్పనంగా ఖర్చుపెట్టి రాజకీయ ప్రచారం చేసుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘము రెండు కలిపి సింగరేణి సంస్థను సింగరేణి కార్మికులను నట్టేట ముంచేందుకే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అప్పనంగా సొమ్మును కాజేస్తూ రాజకీయ జోక్యంతో అజమాయిసు చెల్లాయిస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని పాతర పెడతారని అలాగే గతంలో ప్రైవేటీకరణ పేరుతో అన్ని డిపార్ట్మెంట్లను ప్రైవేటుపరం చేసిన ఏఐటీయూసీని కార్మికులు నమ్మరని జేబీసీసీఐ విషయంలో కార్మిక హక్కుల పోరాటంలో సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ యూనియన్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నందున ఈసారి ఎన్నికల్లో బిఎంఎస్ కు కార్మికులు పట్టం కడతారని వారు తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారి పేర్లు,కాదాసు భీమయ్య సెంట్రల్ కమిటీ సభ్యులు,పొడి శెట్టి వినోద్ ఏరియా,బరపటి మారుతి,అసిస్టెంట్ సెక్రటరీ,నాగార్జున ఆర్కే సిక్స్ అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ, మిట్టపల్లి మొగిలి, శ్రావణ్ కుమార్, పైడిమల్ల శ్రీనివాస్, ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు..