Wednesday, 4 November 2026

తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలకు దేవాలయాలు నిదర్శనం – దైవ చింతనతో మానసిక ప్రశాంతత శివుని ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలగాలి

హుజూర్ నగర్ జూన్ 14 (జనంసాక్షి): తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలకు దేవాలయాలు నిదర్శనమని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కరక్కాయల గూడెం గ్రామంలో నూతన శివాలయ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతరలకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించిందన్నారు. మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నారు. ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని శివయ్య తండ్రిని వేడుకున్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ని సర్పంచ్ కుటుంబ సభ్యులు శాలువా గప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ వార్డు నెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.