సింగరేణి లో ఐఎన్టియూసీ ఆందోళన………………
కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను మరోసారి వేలానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, మా బొగ్గు బాయిలు మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐ ఎన్ టి యుసి సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ ఆదేశానుసారం ఈరోజు యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య గారి అధ్యక్షతన మందమర్రి ఏరియాలో కేకే 5గని పై మోడీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టడమైనది. ఈ సందర్భంగా ఐఎన్టియుసి కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ కాంపెల్లి సమ్మయ్య మరియు కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ గార్లు మాట్లాడుతూ మోడీ గత నెల రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెప్పి తిరిగి సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాటలో చేర్చి తెలంగాణ ప్రజలను, సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారని,2015 లో పార్లమెంట్లో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకై ప్రవేశపెట్టిన ఎం ఎం డి ఆర్ బిల్లుకు టిఆర్ఎస్ పార్టీ ఎంపి లు మద్దతు పలికి ఇప్పుడు నంగణాచిలా పోరాటాలు చేయటమేంటని ఇది వారి మోసపూరిత వైఖరికి నిదర్శమని అన్నారు. కేవలం ఐ ఎన్టియుసి మాత్రమే కార్మికుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘమని, ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యలపై స్పందిస్తూ కార్మికుల హక్కుల కోసం ముందుండి పోరాడుతున్నారని , డిసెంబర్ 11 వ తారీకున మందమరిలో ఐఎన్టియుసి కార్యాలయంలో జరగబోయే ఐఎన్టియుసి జనరల్ బాడీ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు యాదగిరి, రమణా రావు, పిట్ కార్యదర్శి సదయ్య, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, నాయకులు స్వామి,కనకయ్య, రమేష్ నాయక్, రాజేందర్, దేవేందర్, మహేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




