Wednesday, 4 November 2026

సింగరేణి సంస్థను నిండా ముంచుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి కార్మికులే బుద్దిచెప్పాలి

.

 

 

 

 

.సింగరేణి అప్పుల కోసం బ్యాంకుల చుట్టు ఎందుకు తిరుగుతుందో…కార్మికులకు జవాబు చెప్పాలి…? బిఆర్ ఎస్ – టీబిజి కె ఎస్  చేస్తున్న దొంగ దీక్షలు కార్మికులు …సింగరేణి అప్పుల కోసం బ్యాంకుల చుట్టు ఎందుకు తిరుగుతుందో…కార్మికులకు జవాబు చెప్పాలి…? బిఆర్ ఎస్ – టీబిజి కె ఎస్  చేస్తున్న దొంగ దీక్షలు కార్మికులు నమ్మరు…వారికి రోజులు దగ్గరపడ్డాయ్……..బిఎమ్మెస్ నేత అప్పని శ్రీనివాస్…..కార్మిక సోదరులారా………
౼     సింగరేణి సంస్థ మనుగడ కోసం రేపటి భవితరాల అభివృద్ధి ఫలాలు అందించాలని సింగరేణి కార్మికులు చేసిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ బూటకమేనని కేసీఆర్ పాలనలో బహిర్గతమైంది.
౼    సింగరేణి యాజమాన్య నిర్లక్షం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం తీరుతో సింగరేణి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రాష్ట్ర పవర్ యుటిలిటీస్ నుండి సింగరేణి బొగ్గు, విద్యుత్ బకాయిలు సుమారుగా రూ.25,000 వేల కోట్లరూపాయలు అప్పులుగా చేరుకున్నాయి.
౼     తెలంగాణా రాష్ట్రం వచ్చాక సింగరేణి సంస్థ దివాళా అంచుల్లో కొనసాగడానికి నిదర్శనం… సింగరేణి సంస్థబ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరిగి కార్మికుల జీతాలు చెల్లించడమే నిదర్శనం. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణికి మిగులు నిధులు 3.వేల.500 వందల కోట్ల రూపాయల నిధులు బ్యాంకుల్లో డిపాజిట్ గా ఉండేవి… అవి ఇప్పుడు ఉన్నాయా… సమాధానం….చెప్పే దమ్ము కేసీఆర్ గారికి ఉందా…
౼    సింగరేణి నిధుల డిపాజిట్ కోసం గతంలో బ్యాంకులు పోటీపడేవారు. సింగరేణికి అధిక వడ్డీ చెల్లించే బ్యాంకులకు మాత్రమే సింగరేణి టెండర్ ద్వారా డిపాజిట్ చేసే సింగరేణి… నేడు అప్పుల కోసం సింగరేణి యాజమాన్యం బ్యాంకుల వద్దకుఎందుకు తిరుగుతున్నారో… కేసీఆర్ గారు చెప్పాలి…
సింగరేణి సంస్థ డబ్బులు ఎందుకు  కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదో… ఈ నిరసన బానిసలు కార్మికులకు జవాబు చెప్పాలి..!
౼    సింగరేణి జైపూర్ విద్యుత్తును తెలంగాణ ప్రభుత్వం వాడుకొని నేటి వరకు తిరిగి డబ్బులు సుమారుగా 10.000 వేల కోట్ల రూపాయల అప్పులు తిరిగి సింగరేణికి ఎందుకు చెల్లించడం లేదో… జవాబు చెప్పాలి.
౼    సింగరేణి బొగ్గు జెన్కో.ట్రాన్స్కో లు సింగరేణి బొగ్గు వాడుకొని తిరిగి సింగరేణికి డబ్బులు 15,000 వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదో… సమాధానం చెప్పాలి.
సింగరేణి సంస్థ 10,000 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని సింగరేణి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు వడ్డీకడుతున్న సింగరేణి సంస్థ, మన డబ్బులు ఉండగా ఎందుకు బయట వడ్డీ కట్టాల్సిన గత్యంతరం వచ్చిందో సమాదానం చెప్పాలి.
౼     సింగరేణి సంస్థ రూ.35,000 వేల కోట్లు రూపాయలు డబ్బులు మొత్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే… వడ్డిరూపంలో …సింగరేణికి వడ్డీ సంవత్సరానికి రూ.3 వేల 500వందల కోట్ల రూపాయలు: సింగరేణికి అదనంగా ఆదాయం వస్తుంది. ఇది నిజం కాదని చెప్పే దమ్ము ఉందా….
౼    సింగరేణి అంతే కాకుండా మన డబ్బులు మన వద్దే ఉంటే సుమారుగా 45 నూతన బొగ్గు గనులు తెరవవచ్చును.లేక నూతనంగా 45 బొగ్గు బ్లాకులను సంస్థ వేలం ద్వారా పొందవచ్చును. ఇది నిజం కాదనే చెప్పే దమ్ము ఉందా…. నిరసన బానిసలకు…
౼    2023- 2024 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో  49 శాతం వాట కల్గి ఉండి సింగరేణి అభివృద్ధి కోసం 1650 కోట్లు రూ.అభివృద్ధి కోసం కేటాయిస్తే….
౼    తెలంగాణా ప్రభుత్వం 51 శాతం వాట కల్గిన కేసీఆర్ గారి ప్రభుత్వం 9 ఏండ్ల పరిపాలనలో ఒక్క రూపాయి కూడా తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ లో సింగరేణికి ఎందుకు కేటాయించలేదో అడిగే దమ్ము ఉందా ఈ బానిసలకు…….
౼     తెలంగాణా ప్రభుత్వ బడ్జెట్ దేవుడెరుగు నేడు కెసిఆర్  పరిపాలన అవినీతి వళ్ళ నిండా మునిగిపోతున్న సింగరేణి పై కుసంత ప్రేమ కనికరంలేనిటీబిజి కె ఎస్ కార్మిక సంఘంగా కొనసాగడం దురదృష్టకరం.
౼    సింగరేణి సంస్థ నిధులను అప్పనంగాకేసీఆర్  అధికారంతో ఇష్టానుసారంగా సింగరేణి సొమ్మును దారి మళ్ళిస్తు దుర్వినియోగ పరుస్తూ సింగరేణి సంస్థను దివాలతీయడానికి చేస్తున్న నికృష్టపనులు టిబిజికె ఎస్ బానిసలకుకనబడకపోతే వారి నాయకత్వ అవివేకానికి నిదర్శనం…
౼     సింగరేణి వారసత్వ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న దోపిడీ అవినీతి నిజం కదా ..!
౼     సింగరేణిలో తెలుగు దేశం పార్టీ అధికారంలో రద్దైన వారసత్వ ఉద్యోగాలు. తిరిగి సాధిస్తామని కార్మికులను నమ్మబలికి కేసీఆర్ అధికారంలోకి రాగానే కార్మికులకు వారసత్వ ఉద్యోగాల ద్వారా కార్మికుల పిల్లలను భర్తీచేసుకుంటాం అని చెప్పి 2012. గుర్తింపు సంఘంగా గెలిచి…. 2014 సార్వత్రికఎన్నికల్లో మళ్ళీ అదే హామీ ఇచ్చి నేడువారసత్వ ఉద్యోగాల పేరుతో సాగుతున్న  అవినీతి లంచ్చగొండి విదానం ఏంటో ప్రతి ఒక్కరికి తెల్సు.
౼    సింగరేణి గతంలో నుండే కొనసాగుతున్న మెడికల్ బోర్డు పేరును. కేసీఆర్ గారు మెడికల్ ఇన్ వ్యాలీడేషన్ పేరుగా మార్చి టీబిజికె ఎస్ / బి ఆర్ ఎస్ సాగిస్తున్న అవినీతి లంచగొండిపై వందల కోట్ల కుంభకోణంలో. డిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి,.సిబిఐ కిఇచ్చిన పిర్యాదులో కవిత పై ఆరోపణలు పుకార్లు షికార్లు చేస్తున్న అవినీతి మాట నిజం కదా…
౼    సింగరేణి మెడికల్ బోర్డు అవినీతినీ కార్మిక లోకంతో పాటు రాష్ట్రం మొత్తం చూస్తున్నది.
సింగరేణిలో టీబిజికె ఎస్ యూనియన్ ని ,తెలంగాణలో బిఆర్esప్రభుత్వాన్ని బొందపెట్టే సమయం కోసం సింగరేణి కార్మికులు మరియు తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఎదిరిచూస్తున్న సంగతి… బిఆర్ ఎస్ చేస్తున్న దొంగ నిరసన దీక్ష ఉద్యమబానిసలకు… కేసీఆర్ బానిసత్వంతో చేస్తున్న దీక్ష లో  వారికి జ్ఞానోదయం కావాలని వారి బానిసత్వం నుండి వారు విముక్తి కావాలని ప్రతి ఒక్కరు ఆ భగవంతున్ని కోరుకుందాం…
కేటీకె ఓసి లాంగవాల్ ప్రాజెక్టు లో కార్మికులను కలుసుకొని తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణి దివాలగూర్చి కార్మికులకు వివరిస్తూ సంస్థ ప్రయోజనాలకోసం రేపటి భావితరాల భవిష్యత్  కోసం బిఎంఎస్ యూనియన్ తో కార్మికులు కలిసిరావలసిందిగా కోరిన అప్పాని శ్రీనివాస్ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బిఎంఎస్ ) బ్రాంచి ఉపాధ్యక్షులు.     ఈ యొక్క సమావేశంలో రెనుకుంట్ల మల్లేష్ బ్రాంచి కార్యదర్శి.కడారి శంకర్. ఈర్ల సదానందం.MD యూసుఫ్ పిట్ కార్యాదర్శి.డి.నారాయణ.అన్నం శ్రీనివాస్ అడప రాజు కార్మికులు.కార్యకర్తలు పాల్గొన్నారు.