జనంసాక్షి , రామగిరి : ఏఐసిసి కార్యదర్శి , ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ సింగిరెడ్డి పల్లి గ్రామ కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా కోనేటి సత్య నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్న వారికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
సింగిరెడ్డి పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోనేటి సత్యనారాయణ




