Tuesday, 3 November 2026

సింహగర్జనకు మద్దతు తెలిపిన స్థానిక నేతలు

హైదరాబాద్‌ : స్థానిక ఇందిరాపార్కులో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ వాసులు చేపట్టిన 52 గంటల సింహగర్జన కార్యక్రమానికి ఆ ప్రాంతం నుంచి వచ్చిన స్థానిక నేతలు దీక్షకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అనంతపురం కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థి నేతలు దీక్షకు హాజరయ్యారు. మాజీ మంత్రి మారెప్ప దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమను చరిత్రహీనం చేయడానికే రాయల్‌ తెలంగాణ ప్రతిపాదన తీసుకువచ్చారని, సీమను రెండు ముక్కలు చేస్తే చూస్తూ వూరుకోమన్నారు. బైరెడ్డి లాంటి నేత పట్టుదలతో రాయలసీమ రాష్ట్ర సాధనకు ఆందోళన చేస్తున్నారని, సీమ ప్రజలు, నేతలు ఇప్పటికైనా మేల్కొనకపోతే జీవితాంతం కష్టాలేనని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *