సిఎం ఆదేశాల మేరకు విద్యుత్ పనులు
ఆదిలాబాద్,మార్చి26 (జనంసాక్షి) : జైపూర్ సింగరేణి విద్యుత్తు కేంద్రం పనులను ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు పోతున్నామని విద్యుత్తు కేంద్రం ఇన్‌ఛార్జి సంచాలకులు రమేష్‌బాబు పేర్కొన్నారు. వచ్చే వేసవి కల్లా 1200 మెగావాట్ల సింగరేణి విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జైపూరు విద్యుత్తు కేంద్రంలో సవిూక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి విద్యుత్తు కేంద్రం నిర్మాణంపై ఎప్పటికపుడు సవిూక్షిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలను పాటిస్తూ సింగరేణి విద్యుత్తు కేంద్రాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రమేష్‌బాబు పేర్కొన్నారు. ఇందుకోసం సింగరేణి డైరెక్టర్లు 15 రోజులకోసారి పనుల ప్రగతిపై సవిూక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడైనా పనులు ఆలస్యమైతే వెంటనే వాటికి గల కారణాలను తెలుసుకొని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వెనుకబడిన పనులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. పనుల ఆలస్యానికి కారణాలను తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఏజెన్సీలను, అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈఏడాది మేలో మొదటి యూనిట్ లైటప్, జూన్‌లో రెండో యూనిట్ లైటప్ నవంబరుకల్లా సింక్రనైజేషన్, 2016 మార్చి కల్లా కమర్షియల్ విద్యుత్తు ఉత్పత్తికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జరిగిన పనులతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 600 మెగావాట్లు మూడో యూనిట్ నిర్మాణానికి అన్ని అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. మూడోయూనిట్ను సీఎం ఆదేశాల మేరకు 30
నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు కేంద్రానికి కావల్సిన బొగ్గును తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సంచాలకుడు మనోహర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన బ్లాకులను సింగరేణికి అలాట్ చేసినట్లు పేర్కొన్నారు. సంస్థ అవసరాలకు విదేశీ బొగ్గు దిగుమతి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యుత్తు కేంద్రానికి సవిూపంలో ఉన్న చెన్నూరు బొగ్గు బావులను పునఃప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.