Tuesday, 3 November 2026

సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.

సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.

అక్రమ అరెస్ట్ లను నిల్పివేయలి.

అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలి.

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ భోజ్జు పటేల్.

జనం సాక్షి ఉట్నూర్.

రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడ్మ భోజ్జు పటేల్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులను నిరన తెలుపుతు ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి వెడ్మ భొజ్జు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల నిధులను మంజూరు చేయకుండా ఆ నిధులను తప్పుద్రోవా పట్టించడం దారుణమన్నారు. టిపిసిసి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహా ధర్నా కు వెళ్తున్న టీపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు,గృహ నిర్భంధం చేయడం ఆ ప్రజా స్వామికమన్నారు.అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు.సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిరుదుల లాజర్ షేక్ సలీం దూట రాజేశ్వర్ రాహుల్ సర్పంచ్ కొత్తగూడ బచ్చల రావి జైవంత్రావు ప్రేమ్ గున్వంత్రావు రాధ బాయి నిసార్ వెడ్మా జంగూ మోహన్ సిధు తుకారాం రంసవ్ తదితరులు ఉన్నారు