Tuesday, 3 November 2026

పిఆర్టియు టీఎస్ కాలసూచి 2023ను ఆవిష్కరించిన ఎంపీపీ రాథోడ్ సజన్.

పిఆర్టియు టీఎస్ కాలసూచి 2023ను ఆవిష్కరించిన ఎంపీపీ రాథోడ్ సజన్.
నెరడిగొండజనవరి2(జనంసాక్షి):విద్యార్థుల ఉజ్వల భవిష్వ త్తును తీర్చిద్దేందుకు ఉపాద్యాయుల పాత్ర కీలకమైందని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ ఎంఈఓలు అన్నారు.సోమవారం రోజునక్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ రాథోడ్ సజన్ ఎంఇఓ భూమరెడ్డిలు హాజరయ్యారు.వారి చేతులమీదుగా పిఆర్టియు తెలంగాణ స్టేట్ కాలసూచిని మండల విద్యాధికారి కార్యాలయ ఆవరణలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మండల ఎంపీపీ రాథోడ్ సజన్ మాట్లాడుతూ పిఆర్టియు టీఎస్ ఉపాధ్యాయులందరు కూడా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్రధారులని అన్నారు . పిఆర్టియు సభ్యులందరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంఈఓ లతోపాటు డిప్యూటీ తహసీల్దార్ జగదేశ్వరి రాష్ట్ర కార్యదర్శి పాషారాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి బ్రహ్మానందం మండల ప్రధాన కార్యదర్శి కె గంగాధర్ జిల్లా కార్యదర్శి మహేందర్ త తానాజీ మండల మహిళ ఉపాధ్యక్షులు మలేశ్వరి జాధవ్ మనోజ్ ధన్ రాజ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.