Wednesday, 4 November 2026

సిఎం పర్యటనతో కార్మిక నేతల అరెస్టు

ఆదిలాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): కాగజ్‌నగర్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ విద్యుత్తు ప్లాంటు విస్తరణ పనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజకు రానుండంతో  సిర్పూరు-కాగజ్‌నగర్‌ కాగితపుమిల్లు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తుమ్మ రమేశ్‌, జాన్‌ప్రకాశ్‌రావు, లోకేశ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా కాగితపుమిల్లు ఉద్యోగులు, కార్మికులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే పరిరక్షణ కమిటీ ప్రతినిధులను విడుదల చేస్తామని పోలీసులు హావిూ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. వేతన బకాయిలు చెల్లించి, సిర్పూర్‌ పేపరుమిల్లును తెరిపించాలని కోరుతూ గత కొంతకాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *