జనం సాక్షి దుబ్బాకసిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేస్తున్న సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 30 న సీఐటీయూ ఆవిర్భావం జరిగిందిని తెలిపారు. ఈ 53 సంవత్సరాల కాలంలో దేశంలోని అన్ని వర్గాల కార్మికుల సమస్యల పైన అలుపెరగని సమరశీల పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల సాధన కోసం పని చేసిన సంఘం సిఐటియు అని గుర్తు చేశారు.స్వాతంత్య్రం వచ్చిన ప్పటి నుండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ బూర్జవా,భూస్వామిక విధానాలతో కార్మిక వ్యతిరేక విధానాలతో పరిపాలిస్తున్నాయని విమర్శించారు.దేశంలో 53వ సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కార్పోరేట్ వర్గాలకే ప్రతినిధులుగా పాలన చేశారు.తప్ప కార్మిక వర్గం కోసం పని చేయలేదని విమర్శించారు. సిఐటియు లక్ష్యం ఈ బడా బూర్జువా,భూస్వామిక ప్రభుత్వాల స్థానంలో కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు ఏర్పడ్డదని గుర్తు చేశారు.కార్మికవర్గ రాజ్యంతోనే అన్ని వర్గాల ప్రజలకు,కార్మికులకు మేలు జరుగుతుందని లేనియెడల కొద్దిమంది ధనవంతులకు మాత్రమే మేలు చేస్తూ కార్మికుల శ్రమను దోచుకోవడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు.ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్,మతోన్మాద విధానాలతో దేశ ప్రజల మధ్యన కార్మిక వర్గంమధ్యన చీలికలు తీసుకొస్తూ పరిపాలిస్తుందని మర్శించారు. మతోన్మాద విధానాలు దేశానికి పనికిరావని అలాంటి మతోన్మాద ప్రభుత్వాలకు,పార్టీలకు కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ వివిధ రంగాల కార్మికులు మల్లేశం,శ్రీనివాస్, కృష్ణారి,పరశురామ్,జమున, రాధి క తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుబ్బాకలో జెండా ఆవిష్కరణ చేస్తున్న జిల్లా కోశాధికారి జి.భాస్కర్




