Thursday, 5 November 2026

సిఓఈ సెట్-2023 కు దరఖాస్తు చేసుకోండి.

సిఓఈ సెట్-2023 కు దరఖాస్తు చేసుకోండి.
– బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు
– బాలురకు 19,బాలికలకు 21 సిఓఈ లు.
-యంపిసి, బైపిసి, ఎంఈసి, సిఈసి గ్రూపుల్లో మొత్తం 3680 సీట్లు.
బెల్లంపల్లి, జనవరి 13, (జనంసాక్షి )
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ)లలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మీషన్స్ కై నిర్వహించే ప్రవేశపరీక్షకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బెల్లంపల్లి సిఓఈ ప్రిన్స్పాల్ ఐనాల సైదులు తెలిపారు. శుక్రవారం సిఓఈ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల సంస్థ సిఓఈ సెట్ -2023కి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జనవరి 12నుండి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 5వ తేది (ఆదివారం)ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 బాలుర సిఓఈ లలో ఎంపీసీలో 800 సీట్లు, బైపిసి లో 800 సీట్లు, ఎంఈసిలో 40 సీట్లు సీఈసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా బాలికలకు 21 సిఓఈల్లో ఎంపీసీలో 920 సీట్లు, బైపిసిలో 920 సీట్లు, ఎంఈసిలో 120 సీట్లు, సీఈసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలోని విద్యార్ధులు చూపిన ప్రతిభ ఆధారంగా సీట్ల కెటాయింపు జరుగుతుందన్నారు.
ఇతర వివరాలు సంస్థ వెబ్ సైట్స్ https://www.tswreis.ac.in/ https://tsswreisjc.cgg.gov.in లను చూడవచ్చునన్నారు.