సికింద్రాబాద్: రైల్వే పరిసరాల్లో అపరిశుభ్రతకు పాల్పడుతున్నందుకు… ఒకే రోజు వెయ్యి మందిపై కేసులు నమోదు చేసి… రూ.2 లక్షల జరిమాన వసూలు చేశారు. స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో భా గంగా… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం రైల్వే పరిరక్షక దళం ఆకస్మిక దాడు లు నిర్వహించారు. రైల్వే స్టేషన్, పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న వెయ్యిమందిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.2 లక్షల అపరాధ రుసుం రూపేణా వసూలు చేశారు. భారతీయ రైల్వేల్లో ఇదో అరుదైన రి కార్డుగా దక్షిణమధ్యరెల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు.




