Tuesday, 3 November 2026

సిపిఆర్, ఏఈడీ లపై అవగాహన శిక్షణ

పెనుబల్లి, జూన్ 28(జనం సాక్షి)
జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఆదేశానుసారం పెనుబల్లి మండలం లో అన్ని శాఖల సిబ్బందికి బుదవారం పిహెచ్ సి లంకాసాగర్ లో వైద్యు లుడాక్టర్ చింతా కిరణ్ కుమార్ అత్యవసర సమయాల్లో సి పి ఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) ఏవిధంగా చెయ్యాలోఅవగాహన కల్పించారు, ఈ సందర్భం గా వైద్యులు కిరణ్ కుమార్ ఉన్న పాటున గుండే నొప్పితో పడి పోయిన వ్యక్తి కి వైద్యం అందేవరకు ప్రాణాపాయం నుండి కాపాడేందుకు ఆలస్యం చేయకుండా ముందుగా ఏమి చేయాలో వివరించారు, కృత్రిమ శ్వాస లను ఇవ్వడం, చాతి పైన నొక్కడం ద్వారా గుండె శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని చేర వేయగ లుగు తుందని తెలిపారు, ఇది వ్యక్తి యొక్క గుండె, ఊపిరితిత్తులు ఆగిపోయిన తరువాత ఒక వ్యక్తిని సజీవంగా ఉంచడానికి సహాయపడుతుందనివివరించారు,సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెలయ అపక్రమంగా మారడం జరుగతుందని అన్నారు, దీని కారణంగా గుండె పనులు ఆకస్మికంగా కోల్పోవడం వల్ల శ్వాస ఆగిపోతుందని , వ్యక్తి స్పృహ కోల్పోతాడ ని అన్నారు, తక్షణ నిర్వహణ లేనట్లయితే ఆకస్మిక గుండెపోటు వ్యక్తి మరణానికి దారితీస్తుంద ని అన్నారు, ఆ సమయంలో సిపిఆర్ చాతి దగ్గర నొక్కటం, రెస్క్యూస్ శ్వాసలు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాల ని,ఇవి అత్యవసర వైద్య సేవల అందే వరకు నిర్వహించాలని తెలియజే శారు,ఈ కార్యక్రమలో ఎం పి డి ఒ మహాలక్ష్మి, వి ఎం బంజర్ ఎస్ ఐ సూరజ్, ఎసిడిపిఓ మెహరున్నిసా బేగం, స్థానిక నాయకులు లక్కినేని వినీల్ వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.