Tuesday, 3 November 2026

పీవీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్, జిల్లా సెక్రెటరీ భూపెళ్ళి రాజయ్య, జిల్లా మైనార్టీ సెల్ ఆర్గ నైజింగ్ సెక్రెటరీ సయ్యధ్ ఇక్బల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ అఫ్సర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంఛార్జి పెండ్యాల రాజు, చోప్పరి తిరుపతి, బొజ్జ సతీష్, నగునురి నర్సయ్య, చిప్పకుర్తి కనుకయ్య, చాట్ల రాయమల్లు,యూసుఫ్ లళ్లు,చింతపండు మధు, ఎండీ రహీం,రాధకృష్ణ ,నరేందర్ రావు, తుoడ్ల కనుకయ్యా,సదానందం, బోగె రమేష్, మద్దెల రాజయ్య, ఈర్ల పర్వతాలు, కొలేటి రమేష్ , పెండ్యాల లక్ష్మిరాజం తదితరులు ఉన్నారు.