Thursday, 5 November 2026

సిపిఎం జన చైతన్య యాత్ర బుక్లెట్స్ ఆవిష్కరణ చేసిన జడ్పీ చైర్మన్

జనం సాక్షి , మంథని : సిపిఎం జన చైతన్య యాత్ర యొక్క బుక్లెట్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక, నిరుపేద ప్రజలపై దాడి మొదలు పెట్టిందని ఒక ప్రక్క నిత్య అవసరాల వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరో ప్రక్క రైతులపై రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతుల మెడపై ఉరితాలు పెడుతుందని విమర్శించారు. విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు విద్యా రంగాన్ని అప్పజెప్పుతున్నదని, దేశంలో ఉన్న బొగ్గు, స్టీలు, రైలు, విమాన, ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేస్తూ కార్మికుల జీవితాలను రోడ్డుపాలు చేస్తుందని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులు గిరిజనులు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు పెరిగాయని అన్నారు. బిజెపి నిరంకుశ పాలను నిరసిస్తూ కొనసాగే జన చైతన్య యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్ జడ్పిటిసి తగరం సుమలత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుమారస్వామి, మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ తదితరులు పాల్గొన్నారు.