Thursday, 5 November 2026

నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయక నిధి వరం లాంటిది

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి , మంథని : ఆర్థికస్థోమత లేని పేద కుటుంబాలకు కార్పోరేట్‌ వైద్యం అందించాలన్నదే సర్కారు లక్ష్యమని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహాలో ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గాజుల రవికాంత్ కు 42,500 రూపాయల విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహయ నిధి పథకం వరంలాంటిదన్నారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా నష్టపోతున్న నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించేలా సీఎం కేసీఆర్‌ సీఎంఆర్‌ఎఫ్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఆస్పత్రుల్లో వైద్యఖర్చులకు ప్రభుత్వం ద్వారా సాయం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.