సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి: తపస్
ధర్మపురి ( జనం సాక్షి )తపస్ ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఈ కొత్త పెన్షన్ వల్ల ఉద్యోగుల భవిష్యత్తులో లభించబోయే పెన్షన్ షేర్ మార్కెట్ యొక్క లావాదేవీల పై ఆధారపడి ఉంటుందని, ఇది ఏ మాత్రం ఉద్యోగుల భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదని ఈ సందర్భంగా తపస్ నాయకులు మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో రొట్టె శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండి మహేష్ జిల్లా కార్యదర్శి కాశేట్టి రమేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాసెట్టి శ్రీనివాస్ దావనపల్లి రమేష్, బుగ్గారపు హరీష్, బండి ప్రవీణ్, ఎస్.కన్నం నాయుడు, ఎమ్.రాజేష్ ,ఎస్ రాజేష్ కాశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.