*
టేకులపల్లి, ఏప్రిల్ 11( జనం సాక్షి): సిపిఐ ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గూగులోతు రామ్ చందర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం వాసం భద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చందర్ మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ప్రజా పోరు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ప్రారంభమై 18వ తేదీన టేకులపల్లి మండల కేంద్రానికి చేరుకుంటుందన్నారు. ఆ సందర్భంలో బోడు సెంటర్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నందున జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి కో హఠావ్ దేశ్ కు బచావో ఇంటింటికి కార్యక్రమాన్ని సిపిఐ జాతీయ సమితి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా పోరు యాత్ర వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహకార కార్యదర్శి గుగులోత్ శ్రీను వాసం భద్రయ్య, అయిత శ్రీరాములు, ఈసం నరేష్, చింత కన్నయ్య,వాసం నరేందర్, సోనీ తదితరులు పాల్గొన్నారు.




