Tuesday, 3 November 2026

సిరిసిల్ల పెద్దూరు శివారులో ఏడవ శతాబ్దానికి చెందిన అరుదైన సప్త మాతృకల విగ్రహం.

సిరిసిల్ల పెద్దూరు శివారులో ఏడవ శతాబ్దానికి చెందిన అరుదైన సప్త మాతృకల విగ్రహం.

సిరిసిల్ల శివారులో చాళుక్యుల కాలంనాటి ఆనవాళ్లు.

జనం సాక్షి ప్రత్యేకం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 2. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలిసారిగా చాళుక్యుల కాలం ఏడో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహం ఆనవాళ్లు వెలుగు చూసాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో శిథిల విగ్రహం ఒకటి ఉందని అనేక సంవత్సరాల నుంచి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారంటు పరిశోధకులు జర్నలిస్ట్ దుర్గం విజయబాబు ఇచ్చిన సమాచారంతో విగ్రహాన్ని పరిశీలించడం జరిగింది. సమీపంలోని పొలాల్లో శిథిలాల శిల్పాన్ని గుర్తించిన గ్రామస్తులు ఓ చెట్టు వద్ద ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. విగ్రహం సుమారు ఏడవ శతాబ్దానికి చెందిన భాదమి చాళుక్యుల కాలానికి చెందినట్లు విగ్రహ శిల్ప శైలిని బట్టి తెలుస్తుంది. చాళుక్యుల కాలంలో సప్తమాతృకలను ఆరాధ్యంగా పూజించేవారని చారిత్రక ఆనవాళ్లను బట్టి తెలుస్తుంది. ఆనాటి నమ్మకాలను బట్టి సృష్టి చాలకుడు పరమాత్మ అయితే ఆయన చలనశక్తి ఆ పరమేశ్వరి అని పురుష రూపంలో ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది రూపాయలను పొందితే వారి శక్తి స్వరూపమైన దేవి సప్త మాతృకలుగా అవిర్బావించిందని పురాణ ఇతిహాసాలు తెలుపుతున్న సమాచారం. సప్త మాతృకల్లో బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఐంద్రి, చాముండి రూపాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న విగ్రహం శిధిల భాగంలో మొదటి ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగిలిన భాగం లభిస్తే ఇంకా పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవే పరిసర ప్రాంతాల్లో గతంలోనూ పురాతన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు లభించిన విషయం తెలిసిందే. ఒకరాటి ప్రాచీన వ్యాపార కేంద్రానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించి జనం సాక్షి ప్రత్యేక అందించి ఉంది. సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో శాతవాహనుల కాలానికి చెందినది గా భావిస్తున్న ఈ ప్రాంతాల్లో వెలుగు చూసిన అరుదైన లోహ శుద్ధి కేంద్రం చిట్యాల పెట్ట గురించి ప్రత్యేక కథనాన్ని అందించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన సప్త మాతృకల శిల్పం వెలుగు చూడడం ఇదే తొలిసారి. చరిత్రకారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ఇంకా ఆనాటి చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూసి అవకాశం ఉంది.