జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రత్యేక చొరవతో కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులకు గురువారం జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్ భూమి పూజ చేసి పద్మశాలి భవన్ నుంచి బీరుకుల్ల గణపతి ఇంటి వరకు రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులను, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్, బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, జూలపల్లి ఎంపీటీసీ 1 శివ శంకరయ్య , పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, స్థానిక వార్డు సభ్యుడు బీర్కుల గణపతి, బండ రాయలింగు, పడాల మల్లేష్, బొల్లంపల్లి సంతోష్, మెర్గు వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆడపు రమేష్, బండి రాజయ్య, చిటికెన రవి, శ్రీరాముల లింగయ్య ,బండి లింగయ్య, బండి రాజేశం, దాసరి లింగయ్య, బండి మల్లేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనులను ప్రారంభించిన జూలపల్లి సర్పంచ్




