Wednesday, 4 November 2026

మగువలేనిదే మనుగడలేదు – అనాది కాలము నుండి మహిళలను పూజించే ఏకైక దేశం భారతదేశం

హుజూర్ నగర్ మార్చి 9 (జనంసాక్షి): మగువ లేనిదే మనుగడ లేదని, సృష్టికి మూలం స్త్రీ యేనని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గురువారం స్థానిక న్యాయస్థానంలో జరిగిన మహిళా న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ హస్తం ఉంటుందనే నానుడి ముమ్మాటికి వాస్తవం అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా వివిధ రూపాలలో స్త్రీ అందిస్తున్న సేవలు వెలకట్టలేని వన్నారు. బాలికల స్త్రీల సంరక్షణ కొరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం గా అనేక రకాల చట్టాలు చేయబడ్డాయన్నారు. ఈ చట్టాల ద్వారా మహిళలను ఎవరైనా వేదించినా, ఇబ్బంది పెట్టినా కఠినమైన శిక్షలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత సమాజంలో పురుషుడుతో సమానంగా మహిళలు అనేక రంగాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతూ రాణిస్తున్నారని కొనియాడారు. జూనియర్ సివిల్ జడ్జి సంకేత్ మిత్ర మాట్లాడుతూ అనాది కాలము నుండి మహిళలను పూజించే ఏకైక దేశం భారతదేశం అన్నారు. లింగ వివక్షకు ఎవరైనా పాల్పడి గర్భస్రావం చేపిస్తే కఠిన శిక్షలకు గురికాక తప్పదు అన్నారు. ప్రస్తుతం మగవారి కంటే ఆడవారే అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని ఆస్పూర్తి మున్ముందు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆడపిల్ల పుట్టిందని నిరుత్సాహ పడటం పోయి సంబురాలు చేసుకునే స్థితి రావాలని ఆయన కోరారు. అనంతరం సిడిపిఓ విజయలక్ష్మిని మహిళా న్యాయవాదులు సుంకరి ప్రదీప్తి, ప్రార్థనబోయిన మౌనిక లను న్యాయమూర్తులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి దేవి మహిళలను ఉద్దేశించి పాడిన పాట పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, ఏజీపీ ఉప్పల గోపాల కృష్ణమూర్తి, సిడిపిఓ విజయలక్ష్మి, సిఐ రామలింగారెడ్డి, ఎస్సై వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చనగాని యాదగిరి, న్యాయవాదులు సుంకరి ప్రదీప్తి, ప్రార్థనబోయిన మౌనిక, రవికుమార్, కృష్ణయ్య, మీసాల అంజయ్య, రాఘవరావు, కొట్టు సురేష్, రామినేని వెంకటేష్, కమతం నాగార్జున, చంద్రయ్య, పాలేటి శ్రీనివాసరావు, రామ లక్ష్మారెడ్డి, ఒట్టికూటి అంజయ్య, వెంకటరెడ్డి, వెంకటేష్ నాయక్, చక్రాల వెంకటేశ్వర్లు, గొట్టే ప్రశాంత్, మునగపాటి గోపీనాథ్, సైదా హుస్సేన్, పారా లీగల్ వాలంటీర్స్, నియోజకవర్గ స్థాయి అంగన్ వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.