Thursday, 5 November 2026

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కన్నాల సర్పంచ్

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నాల ఎస్సి కాలనీ, బోడగుట్టపల్లె, కొత్త పల్లె, శాలపల్లెలో జెడ్పిచైర్మెన్ పుట్ట మధు చొరవతో మంజూరైన ఈ జి ఎస్ నిధులు రూ. 24 లక్షల 50 వేయిలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను సోమవారం కన్నాల గ్రామ సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్ల గోపాల్, ఎంపిటిసి ఎం అతిక్, సింగిల్ విండో వైస్ చైర్మెన్ కుడికాల సురేష్, వార్డు సభ్యులు రాపెళ్లి అశోక్, బుర్ర సది గౌడ్, సయ్యద్ నయిమా చాంద్ పాషా,సిరిపురం పద్మ వెంకటేష్,మడక లత తిరుపతి, మీర్జా యూసుఫ్ బేగ్, బండారి రాజక్క ,బన్ని, కోటి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.