Tuesday, 3 November 2026

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ లో కమాన్ పూర్ మండల ప్రజా పరిషత్ గ్రాంట్ నుండి మంజూరైన రూ.6 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులకు కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మి గారు భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ ఆకుల ఓదెలు, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, వార్డ్ సభ్యురాళ్లు, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, పిడుగు అంజి, బొంతల ఓదెలు, ఆకుల బాపు, కందుల మధు, మల్యాల భాస్కర్, అవునూరి రాజలింగు, గరిగంటి శంకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు