జనంసాక్షి , మంథని : ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ రావు, మంథని నియోజకవర్గ భిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఉన్నారు.




