సి. సి.రోడ్డు పనులను శంకుస్థాపన.
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మున్సిపాల్టీ పరిధిలో 08 వార్డులో ఎఫ్డిఎఫ్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో,13 వార్డులో డిఎంఎఫ్టి నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో సి.సి రోడ్డు పనులను బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చల్ల శ్రీలత, మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబుతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మెన్ నాగండ్ల శ్రీధర్,డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్యశాఖ ఛైర్మెన్ యామిని వీరయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కొదమగుండ్ల సరిత,తాళ్లూరి సాయి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు,ఆకారపు వెంకటేశ్వర్లు,సులువ యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.