నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ప్రసారాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు.బుధవారం పట్టణ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల శ్రీలత రెడ్డి,అరిబండి సురేష్ బాబు,ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం ప్రధాన కూడలి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ కు బదులు మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా సౌలభ్యంగా కొనసాగుతున్న విద్యుత్ సరఫరాను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక అభివృద్ధి నిరోధకంగా మాట్లాడుతున్నారని రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని.కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్,డిసిసిబి చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి,గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్య శాఖ చైర్మన్ యామిని వీరయ్య,6వ వార్డ్ కౌన్సిలర్ తాళ్లూరి సాయి,14వ కౌన్సిలర్ వేమూరి నాగవేణి నారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు, ఆకారపు వెంకటేశ్వర్లు, ఇంజమూరి రాములు, ఇంజమూరి మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు& వైస్ చైర్మన్లు, సర్పంచులు,యూత్ అధ్యక్షులు కార్యదర్శులు, మహిళా సంఘ నాయకులు, రైతు సంఘం నాయకులు, రైతులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం




