Tuesday, 3 November 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద్.

మర్పల్లి జూలై 05 (జనం సాక్షి) అనారోగ్యానికి గురైన పేద ప్రజలు సీఎం ఆర్ ఎఫ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్పల్లి మండలం తో పాటు నియోజకవర్గంలో మంజూరైన రూపాయలు 15,58,900/- విలువ గల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.